సుందరి – సీతారామ్!

1 సుందరి పేరుకి తగ్గట్టే అందంగా ఉంటుంది. “ఆ, అందాన్ని కొరుక్కు తింటామా ఏం!” అని రసికత లేని కొందరు తీసిపడేస్తూ ఉంటారు. అది నిజమే కావొచ్చు. కానీ కొరుక్కు తినాలనిపించేంత అందంగా ఉంటే తప్పులేదు! అంతటి అందం సుందరికి ఉంది. కానీ తప్పంతా ఆ పేరులోనే ఉంది. “అసలు ఏమాత్రం ఆలోచన ఉన్నా, కూతురుకి ఇలాంటి పేర్లు ఎవరైనా పెడతారా? కాలేజీలో అబ్బాయిలు ఎన్ని కామెంట్లు వేస్తారని?” అని అమ్మతో చాలా సార్లు గొడవ పెట్టుకుంది… Continue reading సుందరి – సీతారామ్!

మధులత

1 ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు… వద్దులే ప్రాణము నీవు రానప్పుడు… ఈ రాయబారాలు సాగే చలిలో! ఈ హాయిభారాలు మోసే జతలో!! చల్లని రాత్రివేళ ఫోన్ లోని FM రేడియో లోంచి వినిపిస్తున్న పాట గదంతా పరుచుకుంటోంది. ఆ గదిలోని మంచం మీద బోర్లా పడుకుని “స్వాతి” లో సరసమైన కథ చదువుతున్న ఆ అమ్మాయి “హాయిభారాలు” అన్న కవిప్రయోగానికి చిన్నగా నవ్వుకుంది. పాట ప్రభావమో, లేక చదువుతున్న కథ మహిమో ఏమో, ఒక కమ్మని… Continue reading మధులత

ద గేమ్!

1 “ఎక్స్క్యూజ్ మీ! కన్ ఐ జాయిన్ యూ?” తియ్యని గొంతు విని తలెత్తి చూశాడతను! తలతిప్పుకోలేని అందం! ఆమే! “ష్యూర్! ఇట్ ఈజ్ మై ప్లెజర్!” “థాంక్యూ!” తన డిన్నర్ టేబుల్ దగ్గర ఆమె కూర్చోవడంతో కాండిల్ లైట్ డిన్నర్ ఫీల్ వచ్చింది అతనికి! ఆమే కాండిల్ మరి! ఆమె సోయగపు మిలమిలల ముందు ఆ ఫైవ్ స్టార్ హోటల్ కాంతుల ధగధగలు చిన్నబోయి మసకబారాయి. శృంగారం అంతా రంగరించినట్టుంది ఆమె చీరకట్టు. కనిపించీ కనిపించనట్టు… Continue reading ద గేమ్!

హ్యాపీ బర్త్ డే !

1 నాకు పుట్టినరోజులు జరుపుకోవడం ఇష్టం ఉండదు ! శ్రీరామనవమి, కృష్ణాష్టమి జరుపుకున్నట్టు మన జయంతి ఉత్సవాలు మనమే జరుపుకోవడానికి ఏమి సాధించామని? “నేను పుట్టానహో !” అని గొంతెత్తి అరవడానికి చేసిన ఘనకార్యమేమిటని? లోకానికి వెలుగునిచ్చే మహా మహా సూర్యుడే రోజూ సైలంటుగా వచ్చి వెళ్ళిపోతుంటాడు ! మనమెంత? “నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తావోయ్ ! ఆనందంగా ఓ రోజు సెలబ్రేట్ చేసుకోడానికి మనం పెట్టుకున్నవే ఈ పుట్టినరోజులూ పండగలూ వగైరా . పెద్ద కారణం… Continue reading హ్యాపీ బర్త్ డే !

చీకటి మరకల ఉదయం!

1 కుక్కర్ మూడో కూత వేసింది! అప్పటికే టిఫిన్ చెయ్యడం పూర్తి చేసి, ఆఫీసుకి వెళ్ళే శ్రీవారికీ, స్కూలుకి వెళ్ళే కూతురుకీ ఆ రోజు వేసుకోవాల్సిన బట్టలు తీసిపెడుతున్న సుభద్ర వెంటనే బెడ్రూంలోంచి వంటింట్లోకి వచ్చి స్టవ్ ఆఫ్ చేసింది. ఏ పనిలో ఉన్నా చెవిని కుక్కర్ కూతలపై వేసి లెక్కతప్పకుండా మూడో కూత తరువాత ఠక్కున కట్టేసే ప్రజ్ఞ ఆమె సొంతం! కూతురూ, భర్తా హడావిడిగా రెడీ అయ్యే లోపు ఆమె వేడి వేడి టిఫిన్… Continue reading చీకటి మరకల ఉదయం!

మన తెలుగు!

(“సిలికాన్ ఆంధ్ర” వారి “మనబడి“ బాలల తెలుగు పాఠశాల అమెరికాలో తెలుగు పిల్లలకి తెలుగు నేర్పుతూ గొప్ప భాషాసేవ చేస్తోంది. ఏటా మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) నాడు జరిగే మనబడి ఉత్సవాలలో చిన్నారులు తరగతులవారీగా ఒక ప్రదర్శన ఇస్తారు. ఆ సందర్భంగా నేను రాసిన చిన్న కల్పిత రచన “మన తెలుగు”. తెలుగు అంతరించిపోయిన భవిష్యత్తు కాలంలో ఇద్దరు పిల్లలు తెలుగు గురించి విని, తెలుగుతల్లి సాయంతో టైం-మెషీన్ ఎక్కి వెనక్కి వచ్చి ఎందుకు తెలుగు… Continue reading మన తెలుగు!

అనగనగా ఓ పింకు పర్సు కథ!

  1 “Blue is for boys and pink is for girls!” “Blue is for boys and pink is for girls!” ఐదేళ్ళ నా కూతురు నన్ను ఆటపట్టిస్తూ ట్యూన్ కట్టి మరీ రిపీట్ మోడ్‌లో పాడుతోంది! స్నానానికి వెళుతూ ఏమరపాటులో నా టవల్ బదులు నా కూతురి పింక్ టవల్ అందుకోబోవడమే నేను చేసిన తప్పు! అందుకు ఈ పరాభవం తప్పలేదు. “చూడు బుజ్జమ్మా! గర్ల్ కలర్స్ అనీ బోయ్… Continue reading అనగనగా ఓ పింకు పర్సు కథ!