తాళి కట్టు శుభవేళ (skit)

ఓ బంధువుల పెళ్ళికి వెళ్ళాను ఆ మధ్య. అక్కడ సరదాగా ఒక skit చేద్దామంటే నేను అప్పటికప్పుడు కూర్చుని ఒక కథనం సమకూర్చడం జరిగింది. ఇది అందరితో పంచుకునే ప్రయత్నమిది.

Roles

1. కిరణ్: హీరో
2. లావణ్య: హీరోయిన్
3. తేజ, రాజా, ఆనంద్, హేమంత్: హీరో ఫ్రెండ్స్
4. లోహిత, హరిత: హీరోయిన్ ఫ్రెండ్స్
5. హీరో అమ్మా నాన్నా

Starting scene

Voice Over

ప్రతి కథా కంచికి చేరినా చేరకున్నా ఎక్కడో అక్కడ మొదలు కాక తప్పదు. ప్రేమ కథలైతే ఎలా మొదలౌతాయో ఎవరికీ తెలియదు. చూపులు కలిసిన శుభవేళగా మొదలైన కథలూ, నిను చూడక నేనుండలేను కథలూ, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా కథలూ ఇలా ఎన్నో. కొన్ని ప్రేమకథలు పెళ్ళిగా మారతాయి. పెళ్ళి వెనుక ఉన్న వలపు కథని సరదాగా ఊహించి మీ ముందు ప్రదర్శించే చిరు ప్రయత్నం ఇది.
Scene 1 – On the Road

లోహిత : Excuse me. జైన్ కాలేజ్ ఎక్కడో చెప్తారా?

తేజ: మీరు చదివే కాలేజ్ మీకే తెలియదంటే మీరు ఎంత బాగా చదువుతున్నారో తెలుస్తోంది.

లావణ్య: హలో, ఓవర్ ఏక్షన్ వద్దు. మేము ఈ రోజే కాలేజీలో జాయిన్ అవుతున్నాం. ఈ ఏరియాకి కొత్త.

కిరణ్: కొత్త డ్రెస్ కొనడానికి గంటలతరబడి రీసెర్చులూ, షాపింగులూ చేస్తారు గానీ కొత్త కాలేజీ ఎక్కడో తెలుసుకునేందుకు, టైం లేదు పాపం!

లావణ్య: Idiots!
Scene 2 – Jain College

కిరణ్: హలో! నేను, ఈడియట్‌ని!

లావణ్య: ఖర్మ! నువ్వూ ఈ కాలేజేనా?

కిరణ్: మీ కాలేజే కాదు, మీ క్లాసేనన్న sad news ఇప్పుడే తెలిసింది. ఇక రోజూ నిన్ను భరించాలి.

లావణ్య: ఆ మాట నేననాలి! నేను చూడ్డానికి అందంగానే ఉంటాను.

కిరణ్: కోతి అందంగా ఉన్నా పెద్ద ప్రయోజనం లేదు!

లావణ్య: నీది కోతి జాతి అని first impression లోనే తెలిసింది. మళ్ళీ నీ వేస్ట్ ఫ్రెండ్ ఒకడు.

రాజా: ఎప్పుడూ ఒకడే వేస్ట్ ఫ్రెండ్ ఉంటే బోరని ఈ సారి వీడితో పాటూ నేనొచ్చా.

హరిత: ఏయ్! ఏంటి దీన్ని అమాయకురాలిని చేసి ర్యాగింగ్ చేస్తున్నారు. మీరూ freshers ఏ అని గుర్తుపెట్టుకోండి.

కిరణ్: ఆడవాళ్ళు అమాయకులనుకునేంత అమాయకుణ్ణి కాదు లెండి

లావణ్య: Idiot!

Scene 3: Freshers day

కిరణ్: Freshers day కపుల్ డేన్స్‌కి మీరు నా పైర్‌గా ఉంటారా? మీరు మంచి డాన్సర్ అని తెలిసింది.

లావణ్య: నీకు ఈ కళలు కూడా ఉన్నాయా? అయినా donkey కి డేన్స్ ఎందుకు?

కిరణ్: థాంక్స్! అందమైన అమ్మాయిలకి పొగరెక్కువని మా ఫ్రెండ్‌తో బెట్ కట్టాను. నువ్వు నన్ను గెలిపించావ్

లావణ్య: యూ…

Scene 4: College canteen

(ఒక సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. కిరణ్ extra curricular activities లో బిజీ అయ్యాడు, కాలేజ్‌లో మంచి పాపులర్ అయ్యాడు. ఒక రోజు క్యాంటీన్‌లో తన friendsతో ఉన్నప్పుడు లావణ్య తన స్నేహితురాళ్ళతో వస్తుంది)

ఆనంద్: మా నాన్న నేను బాగా చదవట్లేదని తెగ లెక్చెర్లు పీకేస్తున్నాడురా!

(ఈ మాటలు విని, interfere అవుతూ)

లావణ్య: ఈ కిరణ్ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఉంటే చదువెలా వస్తుందనుకున్నావ్ బాబూ? వీడికి extras ఎక్కువ, చదువు తక్కువ.

కిరణ్: చూశావా, నీ ignorance మళ్ళీ బైటపెట్టుకున్నావ్. క్యాంటీన్‌లో అబ్బాయిల గ్యాంగ్ కనిపిస్తే చాలు, వాళ్ళు బేవార్సని అనుకుంటారు నీలాంటి వాళ్ళు.

లావణ్య: అవునవును! గాసిప్స్, జల్సాలతో టైం వేస్ట్ చేస్తుంటే మార్క్స్ వస్తాయి కాబోలు

హేమంత్: Text booksని భగవద్గీతలా కాకుండా షిడ్నీ షెల్డన్ నవలలా చదవాలని మా సిద్ధాంతం

లావణ్య: అవును, థ్రిల్లర్ నవలలా ఎగ్జాంస్ ముందు రోజంతా నైటౌట్ చెయ్యడం ఎంత థ్రిల్లింగో! అయినా class topper అరవింద్‌ని చూసి బుద్ధి తెచ్చుకోండి

కిరణ్: వాడు బాదంపాల లాంటి వాడు, నేను పెప్సీ లాంటి వాణ్ణి. వాడు బెటర్ అయ్యుండొచ్చు గానీ, నేను super cool and chilling!

లావణ్య: పెప్సీ అంటే pesticide. అందుకే నేను నీలాంటి వాళ్ళతో friendship చెయ్యను.

కిరణ్: సరే, వాడితో friendship చేసి చూడు, నీకే తెలుస్తుంది
Scene 5: Ladies hostel
లావణ్య: ఏంటోనే! ఆ కిరణ్ గాడంటే ఈ మధ్య positive feelings కలుగుతున్నాయ్. వాడు మిరపకాయలా ఘాటనుకున్నా ఇన్నాళ్ళూ, కానీ మిరపకాయ బజ్జీలోనే టేస్టుంది!

లోహిత: అదేంటే! మరి మన class topper అరవింద్ లాంటి sincere student తోనే ఫ్రెండ్‌షిప్ చేస్తానన్నావ్?

లావణ్య: hmm…, వాడు ఎగ్జాంలో ఆన్సర్‌షీట్‌ని బాగా fill చేస్తాడు కానీ వాడి లైఫ్ మాత్రం blank sheet ఏ! ఒక సినిమా లేదు, సరదా లేదు, ఎప్పుడూ స్టడీసే. ఈ కిరణైతే అన్నింట్లో ఉంటాడు, చదువూ ఫర్వాలేదు. I like him.

హరిత: I like him ఆ, లేక I love him ఆ? త్వరగా తేల్చుకో. అసలే నువ్వు spellings లో పూర్!
Scene 6: Hero room
కిరణ్: ఏదో ఘోరం జరుగుతున్నట్టు అనిపిస్తోందిరా! నేను లవ్‌లో పడుతున్నట్టు ఉన్నాను.

తేజ: ఆ లావణ్య పైనేనా లవ్? మేమెప్పుడో అనుకున్నాం. ఐనా లోపల feelings లేకపోతే, అంత ముద్దుగా మీరు దెబ్బలాడుకోలేరు

రాజా: జాగ్రత్తరోయ్, ఈ ప్రేమ దేవుడికి కూడా దోఖా ఇచ్చేస్తుంది.

కిరణ్: I am confident, our love will be a success. కానీ ఎలా చెప్పాలా అనేదే తేలట్లేదు.

ఆనంద్: చూశావ్ రా! pulsar పైన 120 స్పీడ్‌లో వెళ్ళే నీకే starting trouble ఇస్తోంది ఈ ప్రేమ.

హేమంత్: మగాడంటే డేరూ జోరూ ఉండాలి. నువ్వే ముందు ప్రపోజ్ చెయ్యాలి.

కిరణ్: అందుకే రేపు personal గా కలుస్తున్నాను. తనని రమ్మని చెప్పాను.

ఫ్రెండ్స్ అందరూ: అమ్మనీ, నువ్వు తక్కువ వాడివి కాదురోయ్!

Scene 7: Love Proposal


కిరణ్: ఎందుకో ఈ రోజు నిన్ను చూస్తుంటే ఓ మెరుపు మెరిసినట్లు అనిపిస్తోంది

లావణ్య: (చిరునవ్వుతో) నన్ను చూడకపోయినా అనిపిస్తుంది. ఒకసారి పైకి చూడు. వర్షం పడేలా ఉంది. ఆకాశం మబ్బుపట్టి మెరుపులు కురిపిస్తోంది!

కిరణ్: ఆ మెరుపు కాదు, ఈ మెరుపుని మా ఇంట్లో దాచేసుకుందామా అనిపిస్తోంది

లావణ్య: అబ్బో, మెరుపుతో పాటూ ఉరుములూ ఉంటాయి మరి

కిరణ్: మెరుపు తోడుంటే ఉరుముల్ని ఎలాగైనా భరించొచ్చు. మరి వర్షంలో తడిసి ముద్దవ్వడానికి నువ్వు రెడీనా?

లావణ్య: (సిగ్గు)
Scene 8: Hero – Heroine meet at Tank Bund
చదువులు అయిపోయి లావణ్యా కిరణ్‌లూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రణయం కొనసాగుతోంది.

కిరణ్: ఏంటో, కాలేజ్‌లో ఉన్నప్పుడు చదవడానికి టైం లేదు, ఇప్పుడు లవ్ చెయ్యడానికి టైం లేదు. work, work, work!. బాస్ గాడు పీక్కుతింటున్నాడు. వీడి కంటే ఆ కాలేజ్ ప్రిన్సిపాలే బెటర్.

లావణ్య: టైం లేదని చూస్తూ ఉండు. కొన్నాళ్ళకి ఏజ్ కూడా ఐపోతుంది. ప్రతివారం నేను ఇక్కడికి వచ్చేది ఆ బుద్ధవిగ్రహాన్ని చూడ్డానికి కాదు, ఈ బుద్ధవిగ్రహాన్ని చూడ్డానికని మా వాళ్ళకి తెలిసేలోపే నువ్వు మీ ఇంట్లో చెప్పాలి. గంటల తరబడి cell phone లో మాట్లాడుతూ ఉంటే క్యాన్సర్ రావొచ్చట. కాబట్టి ఈ సెల్ ఇంక వదిలి నీ ఇల్లు చేరేలా చెయ్!

కిరణ్: ప్రపోజ్ చేసే రిస్కూ నాదే, ప్రేమించే రిస్కూ నాదే, ఇప్పుడు parents కి చెప్పే రిస్కూ నాదేనా? నువ్వు ముందు మీ ఇంట్లో చెప్పొచ్చుగా?

లావణ్య: సరే, అంత రిస్క్ ఐతే, ఇంక ఇష్క్ బంద్ చేసుకుని బై బై అనుకుందాం

కిరణ్: అమ్మో! ఈ రిస్కు లేకపొతే లైఫే లేదు.
Scene 9: Hero telling to parents about his love
కిరణ్ అమ్మానాన్నలతో dinner table దగ్గర

కిరణ్: అమ్మా! ఎన్నాళ్ళిలా ఒక్కదానివే కష్టపడతావ్. వంటావార్పూ తెలిసిన ఓ మంచి కోడలు కావాలని లేదా? నాన్నా, నిన్ను “మావయ్య గారు” అని పిలిచే అమ్మాయుంటే ఎంత బాగుంటుంది?

అమ్మ: వీడి వాలకం తేడాగా ఉందీ మధ్యని నేననలేదూ? మనం సంబంధాలు చూస్తే వద్దంటాడు. వీడే చూసుకున్నట్టున్నాడు. ఎవరో, ఏమిటో?

కిరణ్: రూపం లోనూ, గుణం లోనూ, చివరికి కులం లోనూ కూడా తను మీకు నచ్చేలాగే ఉంటుంది.

లావణ్య గురించి చెప్తాడు కిరణ్

నాన్న: మీకు నచ్చే పిజ్జాలు నాకు నచ్చవు. మా పద్ధతులు మీకు నచ్చవు. నీకు ఆ రావుగారమ్మాయి రాగేశ్వరి అయితేనే కరెక్ట్. తననే చేసుకోవాలి. ఇది నేనొప్పుకోలేను.

కిరణ్: నా జీవిత భాగేశ్వరిని నేను ఎంచేసుకున్నాక, ఇంకా ఈ రాగేశ్వరి ఎందుకు నాన్నా?
Scene 10: Final scene, Hero and Heroine in a park
లావణ్య: అవునూ, ఇంతకీ మీ నాన్నగారిని ఎలా ఒప్పించావ్?

కిరణ్: simple! నిన్ను చేసుకుంటే కనీసం నేను హ్యాపీగా ఉంటానన్న గ్యారంటీ నాకుంది, మా అమ్మానాన్నా హ్యాపీ కాకపోయినా. మా నాన్న కోరుకున్న సంబంధం చేసుకుంటే ఈ గ్యారంటీ కూడా లేదు కదా. ఇదే చెప్పాను.

లావణ్య: ఏమన్నారు?

కిరణ్: “ఈ వయసులో ఇలాగే అనిపిస్తుంది. అనుభవంతో చెప్తున్నాను, నేను చెప్పిన సంబంధమే అన్నివిధాలా మంచిది” అన్నారు

లావణ్య: నువ్వేమన్నావ్?

కిరణ్: నాకు నచ్చిన ఈ సంబంధం చేసుకుంటే ఆ అనుభవమేదో నాకూ వస్తుంది కదా అన్నాను

లావణ్య: ఓకే

కిరణ్: “నువ్వు మాట వినవ్. తర్వాత నువ్వే ఇబ్బందులు పడతావ్” అన్నారు. పెళ్ళంటూ చేసుకున్నాక ఎలాగూ ఇబ్బందులు పడక తప్పదు కదా అని నేను అనేసరికి ఇంకేమీ అనలేకపోయారు!

లావణ్య: ఓయ్…

Advertisements

7 thoughts on “తాళి కట్టు శుభవేళ (skit)

  1. పెళ్ళంటూ చేసుకున్నాక ఎలాగూ ఇబ్బందులు పడక తప్పదు కదా అని నేను అనేసరికి ఇంకేమీ అనలేకపోయారు! — highlight… 🙂

    Like

  2. చాలా బాగుంది. కథ చెప్పె విధానం నచ్చింది. నెను మొదటి సారి పూర్తిగా చదివిన తెలుగు పొస్ట్ బహుష ఇదె అనుకుంటా.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s