మన తెలుగు!

(“సిలికాన్ ఆంధ్ర” వారి “మనబడి బాలల తెలుగు పాఠశాల అమెరికాలో తెలుగు పిల్లలకి తెలుగు నేర్పుతూ గొప్ప భాషాసేవ చేస్తోంది. ఏటా మాతృభాషా దినోత్సవం (ఫిబ్రవరి 21) నాడు జరిగే మనబడి ఉత్సవాలలో చిన్నారులు తరగతులవారీగా ఒక ప్రదర్శన ఇస్తారు. ఆ సందర్భంగా నేను రాసిన చిన్న కల్పిత రచన “మన తెలుగు”. తెలుగు అంతరించిపోయిన భవిష్యత్తు కాలంలో ఇద్దరు పిల్లలు తెలుగు గురించి విని, తెలుగుతల్లి సాయంతో టైం-మెషీన్ ఎక్కి వెనక్కి వచ్చి ఎందుకు తెలుగు అంతరించిందో తెలుసుకుంటారు ఈ కథలో.

కథలో నీతి పాతదే అయినా, కథనంలో కొంత కొత్తదనాన్ని సాధించడానికి నేను చేసిన ప్రయత్నం ఎంతవరకూ సఫలీకృతం అయ్యిందో తెలియదు! పెద్దల రచనలు చెయ్యడం కన్నా పిల్లలు ప్రదర్శించే ఇలాంటి సంక్షిప్త నాటకాలు రాయడం చాలా కష్టం అని నాకు తెలిసొచ్చింది.నేను ఇచ్చిన స్క్రిప్ట్‌ని మనబడి వాళ్ళు కొంత కుదించి మెరుగుపరిచారు. చిన్నారులు ముద్దుగా ప్రదర్శించారు, ముఖ్యంగా తెలుగుతల్లి పాత్రధారిణి ఆకట్టుకుంటుంది! ఈ నాటకాన్ని యూట్యూబులో చూడొచ్చు. పిల్లలకి అభినందనలు, ఆశీస్సులు. మనబడి వారికి ధన్యవాదాలు!)

వ్యాఖ్యత: భాష జనహృదయ స్పర్శ! మనసుతో మాట్లాడేదే భాష! తెలుగు జాతి తెలుగుని మరిచిపోతే, ఒకవేళ తెలుగు అంతరించిపోతే ఏమౌతుందన్న ఊహే ఈ “మన తెలుగు” రూపకం! రెండు వందల ఏళ్ళ తరువాత తెలుగుఅంతరించిపోయిన కాలంలో, శాండియాగోలోని ఓ తెలుగు రాని తెలుగు ఇంటిలో ఈ కథ మొదలౌతుంది!

సీన్-1

(పాత్రలు: నాన్న, సుహాస్)

నాన్న: Suhas! Remember, it is Saturday and you have to assist me in garage cleaning!

సుహాస్: phew! ok, dad! do I have an option!

(గెరాజ్లో క్లీనింగ్ చేస్తూ ఉండగా…)

సుహాస్: Dad, what is this box? I see it all the time but never opened it. It has some very old books in a strange language with a round and beautiful script.

నాన్న: Well, that one! It must be Telugu! Supposedly our ancestors spoke it. It is dead now. This box was handed over from generation to generation! Donno why I am still keeping it. Maybe we can trash it!

సుహాస్: Don’t trash it dad! Even the dead need proper burial. I find it interesting, let me take it to my room!

సీన్-2

(పాత్రలు: సుహాస్, సుహాస్ స్నేహితుడు విహాన్)

విహాన్: So, you say this language Telugu is quite beautiful!

సుహాస్: Yes, I could dig out some old Youtube videos, it not only looks beautiful and sounds very sweet too. I could find some wonderful music and movies too. Some movies with English titles are rather funny, though!

విహాన్: Why was it dead then?

సుహాస్: Wikipedia says it was dead because Telugu people lost love for their language and stopped speaking it! Can you believe it?

విహాన్: Yes, I can! I always told you that these adults are crazy! What do you expect?

సుహాస్: Whatever! I want to know how it all happened. I want to learn Telugu too! Currently very few people understand it, just some university profs.

విహాన్: Idea! Let us ask the secret wish granting tree I found with my detective skills!

సుహాస్: Dad says such trees do not exist, it is all fiction!

విహాన్: Come on! what is the harm in trying? If you have the desire and the heart, fiction becomes reality.

సీన్-3

(పాత్రలు: సుహాస్, విహాన్, తెలుగుతల్లి)

విహాన్: Wishing tree! Wishing tree! Our heart yearns to learn all about Telugu. You are our only chance. Please help us!

సుహాస్: See, nothing happened. I told you!

విహాన్: Hmm, I am disappointed!

తెలుగుతల్లి: నిరాశ చెందకండి పిల్లలూ! మీరే డీలా పడితే భవితే లేదు!

విహాన్: I hear a voice!

సుహాస్: In Telugu!! Who is it?

(ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు)

ఇద్దరూ: ఎవరు మీరు? ఆశ్చర్యంగా ఉందే! మాకు తెలుగెలా వచ్చింది?

తెలుగుతల్లి: కల్పవృక్షాన్ని, అదే మీ wishing tree ని, కోరుకుంటే ఏదైనా సాధ్యమే! నన్ను తెలుగు తల్లి అంటారు! ఇన్నాళ్ళకి నన్ను తలుచుకునే వాళ్ళు కనబడ్డారు! అందుకె ప్రత్యక్ష్యమయ్యాను. మీకు తాత్కాలికంగా తెలుగువచ్చేలా చేశాను!

సుహాస్: ఓహో! బాగుంది, బాగుంది. నాకు తెలుగు గురించి అంతా తెలియాలి. అంత తియ్యని భాష ఎందుకు అంతరించింది, మీరు చెప్పగలరా?

తెలుగుతల్లి: ఓ తప్పకుండా! చెప్పడమే కాదు, మీకు జరిగింది చూపిస్తాను కూడా!  పదండి, సమయవిహారిణిలో ప్రయాణిద్దాం!

విహాన్: సమయవిహారిణా?

తెలుగుతల్లి: అదే ఇంగ్లీషులో time-machine  అంటారుగా!

విహాన్: ఆహా! నేను పుస్తకాల్లో చదివిన వింతలన్నీ మీ మాయ పుణ్యమా అని నిజంగా జరిగిపోతున్నాయ్!

తెలుగుతల్లి: తెలుగు మాయమైపోయింది ఎలాగూ, కనీసం మాయైనా మిగలాలి కదా! పదండి పోదాం!

సీన్ – 4

(పాత్రలు: సుహాస్, విహాన్, తెలుగుతల్లి, పార్కులో తల్లులు)

తెలుగుతల్లి: ఇప్పుడు మనం 2015 సంవత్సరంలో భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉన్నాం. మనకీ అందరూ కనిపిస్తారు, కానీ మనం ఎవరికీ కనిపించం.

విహాన్: అద్భుతం! తెలుగు పుణ్యమా అని నేను పుస్తకాల్లో చదివిన వింతలన్నీ జరిగిపోతున్నాయి!

సుహాస్: ఈ పార్క్ బావుంది. పిల్లలు ముద్దుగా ఆడుకుంటున్నారు.

తెలుగుతల్లి: తల్లులు కబుర్లలో తేలుతున్నారు. ఇప్పుడే ఎవరో తెలుగు ప్రస్తావన తెచ్చారు. చూడండి ఏం జరిగిందో!

(పార్కులో పిల్లల తల్లులు ఓ చోట చేరి మాట్లాడుకుంటున్నారు)

తల్లి 1: మా వాడి ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ కంపల్సరీ తెలుసా! ఎల్కేజీ నుంచే అంగ్రేజీ!

తల్లి 2: ఆ! అదే మంచిది! తెలుగు నేర్చుకుని చేసేది ఏముంది? ఇప్పుడంతా ఇంగ్లీష్ యుగం. నువ్వే చూడు “కంపల్సరీ” అన్నావ్ ఇప్పుడు, దానికి తెలుగు ఏమిటో కూడా మనకి తెలీదు!

తల్లి 3: నిజమే! కూరలో తాళింపు చేరినట్టు మన వాడుక భాషలో ఇంగ్లీషు చేరిపోయింది. నెమ్మది నెమ్మదిగా అంతా ఇంగ్లీషే అయిపోతుందేమో!

తల్లి 1: అవ్వనీ! ఏం నష్టం? భాష కన్నా సంభాషణ ముఖ్యం! కబుర్లు ఇంగ్లీషులో చెప్పుకుంటే తప్పేముంది?

తల్లి 2: ఏం తప్పు లేదు! అదే బెటర్! తెలుగులో మాట్లాడితే అమ్మలక్కల సోది అంటారు! ఇంగ్లీషులో అయితే పోష్‌గా గాసిప్ అనొచ్చు.

(అందరూ నవ్వులు)

సీన్ – 5

(పాత్రలు: సుహాస్, విహాన్, తెలుగుతల్లి)

తెలుగుతల్లి: చూశారుగా! మీకు అర్థమైందా ఇప్పుడు తెలుగుకి ఎందుకీ అవస్థ పట్టిందో!

సుహాస్: అయితే, ఇంగ్లీషు తెలుగుని మింగేసిందన్నమాట!

తెలుగుతల్లి: కాదు. ఏ భాషా ఇంకో భాషకి అన్యాయం చెయ్యదు. మనం తెలుగుపై మమకారాన్ని కోల్పోయి, నెపాన్ని మాత్రం ఇంగ్లీషుపై నెట్టేశాం!

విహాన్: కానీ కాలంతో పాటూ మనమూ మారాలి కదా! వాళ్ళ వాదన బానే ఉంది. మన భావాలని వ్యక్తపరచడానికి ఏ భాష ఐతే ఏం?

తెలుగుతల్లి: భాష కేవలం రోజూవారీ సంభాషణల కోసం మాత్రమే కాదు. భాషతో పాటూ ఆటపాటలూ, సాహిత్యం, సంగీతం, సంస్కృతీ, సంప్రదాయం ఇవన్నీ ముడిపడి ఉంటాయి! భాషని కోల్పోవడం అంటే ఇవ్వన్నీ కోల్పోవడమే!

విహాన్: నేనీ విషయం ఆలోచించనే లేదు.

తెలుగుతల్లి: అంతే కాదు! భాష అంతరించిపోతే ఆ భాషలో ఉన్న జ్ఞానసంపద కూడా అంతరిస్తుంది. ఇది తీరని నష్టం!

విహాన్: అవును, మంచి విషయం తెలిపారు. వృక్ష, జంతుజాతుల్ని సంరక్షించుకున్నట్టే భాషనీ రక్షించుకోవాలని నాకు అర్థమైంది.

సుహాస్: చాలా బాగా చెప్పారు! అయితే ఈ తరంలో తెలుగుకోసం తాపత్రయపడ్డవాళ్ళే లేరా?

తెలుగుతల్లి: ఎందుకులేరు. తెలుగుని ప్రాణంగా ప్రేమించిన వారు ఈ తరంలోనూ లేకపోలేరు. మీ ఊరు శాండియోగోలోనే ఉన్న అలాంటి వాళ్ళని చూద్దాం పదండి.

సీన్-6

(పాత్రలు: సుహాస్, విహాన్, తెలుగుతల్లి)

విహాన్: అప్పట్లో శాండియాగో ఎంత బావుందో! మనం ఎక్కడికి వచ్చాం? ఇదేదో పాఠశాల లాగ ఉందే?

తెలుగుతల్లి: అవును, మీ వంటి పిల్లలకు తెలుగు నేర్పించే పాఠశాల. పేరు మనబడి. అమెరికాలోని తెలుగు పిల్లలు తెలుగు మరిచిపోకూడదన్న తపనతో స్థాపించారు.

సుహాస్: చాలా బావుంది. పిల్లలు భలే శ్రద్ధగా నేర్చుకుంటున్నారు.

తెలుగుతల్లి: అవును! అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు ఉంటే పిల్లలకు శ్రద్ధ అదే కలుగుతుంది.

సుహాస్: మనబడి వంటి గొప్ప ప్రయత్నాలు జరిగిన తెలుగు ఎలా అంతరంచింది?

తెలుగుతల్లి: మనబడి ఒంటరిగా తెలుగుని ఒడ్డెక్కించలేదు. తల్లితండ్రుల చేయూత కావాలి, పిల్లలకి వాళ్ళే ఆదర్శం అవ్వాలి. అది ఆశించినంత జరగకే తెలుగు అంతరించింది!

సుహాస్, విహాన్: అయ్యో!

తెలుగుతల్లి: సాధారణంగా వ్యాధుల వల్లో, యుద్ధం వల్లో, సామాజిక సంఘర్షణల వల్లో భాషలు అంతరిస్తాయి. కానీ తెలుగుప్రజల అలసత్వం వల్ల మాత్రమే తెలుగు అంతరించింది. ఇదీ పిల్లలు తెలుగు కథ, నా కథ. ఇక మీ కాలానికి వెళ్దామా?

సుహాస్: మేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే తెలుగు మరిచిపోతామా?

తెలుగుతల్లి: అవును!

సుహాస్: అయితే ఇప్పుడే తెలుగు మరిచిపోయేటట్టు చేసి మమ్మల్ని ఇక్కడే కొన్నాళ్ళు ఉండనీ తల్లీ!

విహాన్: అవును. మేము మనబడిలో చేరి తెలుగు చక్కగా నేర్చుకున్నాకే వెనక్కి వస్తాం.

తెలుగుతల్లి: భళా బాలకుల్లారా! భళా! నాకు అమితానందం కలిగించే మాట చెప్పారు. మీవంటి పిల్లలు ఉంటే చాలు, తెలుగు మళ్ళీ మీ తరంలో గత వైభవాన్ని పొందుతుంది. తథాస్తు!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s