ద గేమ్!

1

“ఎక్స్క్యూజ్ మీ! కన్ ఐ జాయిన్ యూ?”

తియ్యని గొంతు విని తలెత్తి చూశాడతను! తలతిప్పుకోలేని అందం! ఆమే!

“ష్యూర్! ఇట్ ఈజ్ మై ప్లెజర్!”

“థాంక్యూ!”

తన డిన్నర్ టేబుల్ దగ్గర ఆమె కూర్చోవడంతో కాండిల్ లైట్ డిన్నర్ ఫీల్ వచ్చింది అతనికి! ఆమే కాండిల్ మరి! ఆమె సోయగపు మిలమిలల ముందు ఆ ఫైవ్ స్టార్ హోటల్ కాంతుల ధగధగలు చిన్నబోయి మసకబారాయి. శృంగారం అంతా రంగరించినట్టుంది ఆమె చీరకట్టు. కనిపించీ కనిపించనట్టు అందాలని ప్రదర్శించి కవ్వించడం చీరకే తెలిసిన విద్య! ఈ కిటుకు ఆమెకి బాగా తెలిసినట్టుంది, చీరని ఎలా కడితే మగవాళ్ళ గుండెలు గల్లంతవుతాయో అలాగే కట్టింది! బ్యూటీ, సెక్సీనెస్ రెండూ సమపాళ్ళలో కలిగిన ఆమెను ఉదయం బ్రేక్ఫాస్ట్ అప్పుడు చూశాడు. గుండె ఝల్లుమంది! ఇప్పుడు ఆమె తనంత తానే డిన్నర్ తనతో కలిసి చేస్తాననడం, ఎదురుగా కూర్చోవడం చూస్తే గుండె ఆగిపోతుందేమో అనిపించింది అతనికి! ఆగిపోయినా ఫర్వాలేదు అనుకున్నాడు. ఆమెలాంటి అందాన్ని చూస్తూ పోతే స్వర్గలోకం గ్యారంటీ!

ఆమె సోయగపు మత్తులో చిక్కుకుని ఆమెనే చూస్తూ ఉండిపోయాననీ, పరిచయమే చేసుకోలేదనీ అతనికి సడెన్‌గా గుర్తొచ్చి, గొంతు పెగిల్చేలోపే ఆమే తన అందమైన పెదాలు విప్పి మాట్లాడింది –

“ఓ గేం ఆడదామా?”

“గేం?”

“అవును! మీ పేరూ వివరాలూ మీరు చెప్పొద్దు, నేనూ నా డీటైల్స్ చెప్పను, జస్ట్ ఫ్రీగా కబుర్లు చెప్పుకుందాం! ఇట్ విల్ బి ఫన్!”

అతని పెదాలపై ఓ చిరునవ్వు! ఈ గేమ్ ఎక్కడికి దారితీస్తుందో అని అతనికి థ్రిల్లింగ్ గా ఉంది. ఈ రాత్రి అదృష్టం తలుపు తట్టి, కలిసి డిన్నర్ చెయ్యడమే కాక ఒళ్ళో కూడా వాలుతుందా?

“ఓకె! ఈ వెరైటీ డేట్ కి నేను రెడీ!” అన్నాడతను.

“నేను డేట్ అనలేదే!” అందామె చిలిపిగా.

“మీలాంటి అందమైన అమ్మాయితో ఓ ఐదు నిమిషాలు మాట్లాడినా అది డేట్ లానే ఉంటుంది!”

“నాట్ బ్యాడ్! సో ఆర్ యూ సింగిల్?”

“యెస్! ఒకవేళ సింగిల్ కాకపోయినా మీరొచ్చి అడిగితే సింగిల్ అనే చెప్పేవాణ్ణి!”

అతని మాటలకి ఆమె అందంగా నవ్వింది. ఆ నవ్వు అతనిలో కోరికని ఇంకా వెలిగించింది!

డిన్నర్ చేస్తూ వాళ్ళు మాట్లాడుకున్న మాటల మధ్యలోని మౌనక్షణాలని పెయింట్ గా చేసి, తన కన్నుల కుంచెలతో ఆమె అందమైన రూపాన్ని మనసులో గీసి ప్రతిష్టించుకుంటున్నాడు అతను! ఆమె గొప్ప అందగత్తె అనడంలో సందేహం లేదు. కానీ అతనికి బాగా నచ్చింది ఆమె మేకప్! ఎర్రని పెదాలని మరింత అందంగా చూపిస్తూ పెదాలపై అద్దీ అద్దనట్టు లిప్ స్టిక్! ముద్దగా కొట్టుకొచ్చినట్టు కనిపించే లిప్ స్టిక్స్ అతనికి నచ్చవు. ఆమె వాడిన పెర్ఫ్యూం ఏం బ్రాండో తెలీదు కానీ ఆమె అందాన్ని సువాసనగా మోసుకొచ్చి అతన్ని తాకుతోంది. ఘాటుగా ముక్కుపుటాలు అదిరిపోయే పెర్ఫ్యూం కాదది! ఆమె అందానికి ముస్తాబులా, ఆమె ఆడతనాన్నిపెంపొందించేలా, పూల సువాసనలా హాయిగా తాకుతోంది. ఎగ్జాక్ట్లీ యాజ్ హి లైక్స్! ఆమె అతను కోరుకున్నట్టే ఉండడం అతను ఆమెను కోరుకునేలా చేస్తోంది.

అతని కళ్ళల్లో ఆరాధనని ఆమె గ్రహించకపోలేదు! ఆ చూపుల్లో కనిపిస్తున్న పొగడ్తలకి ఆమె గర్వపడింది. టీ-షర్ట్, జీన్స్ వేసుకున్న అతను స్టైలిష్ గా హేండ్సంగా ఉన్నాడు అనుకుంది ఆమె. ఇష్టపడ్డ పురుషుడి కన్ను తనపైనే ఉండడం నచ్చని ఆడవాళ్ళు ఎవరు?

కళ్ళతో కొంటెతనాన్ని, మాటలతో చిలిపితనాన్ని ప్రదర్శిస్తూ సాగిన వారి డిన్నర్ కబుర్ల వలన అతనికి ఆకలి తీరకపోగా దాహం ఏదో పెరిగింది! ఆమెతో తెలివిగా ఫ్లర్ట్ చేస్తూ అతను తన వాక్చాతుర్యాన్ని ఎంత ప్రదర్శించినా ఆమె సోయగపు చాతుర్యం ముందు అది దిగదుడుపే అని అతనికి అర్థమైంది. ఆమె ప్రతి చేష్టలో శృంగారం కనిపించింది అతనికి. డిన్నర్ పూర్తయ్యేటప్పటికి ఆమె మత్తులో పూర్తిగా మునిగిపోయాడు!

డిన్నర్ తర్వాత ఏమవుతుందోనని అతనికి ఉత్కంఠతగా ఉంది. ఇద్దరి మధ్యా కాసేపు మౌనం! అతని ఉత్కంఠతకి తెరదించుతూ ఆమే మాట్లాడింది –

“ఓకె మై డియర్ హేండ్సమ్! ఈ రాత్రి నీతో డిన్నర్ బాగా ఎంజాయ్ చేశాను! ఉంటాను మరి! గుడ్ నైట్!” అని చటుక్కున లేచి వెళ్ళసాగింది!

అతను నిరుత్సాహంగా ఆమె వెళుతున్న వైపే చూడసాగాడు! ఓపెన్ బ్యాక్ బ్లౌజ్ లో ఆమె శృంగారంగా సాగుతూ ఉంటే ఆమె అందాన్ని చూసి గుటకలు వేశాడు! అందీ అందని అందమేనా ఆమె?

ఇంతలో ఆమె హఠాత్తుగా వెనక్కి తిరిగి –

“డోంట్ ఫాలో మీ!!” అని కన్నుకొట్టి వెంటనే తల తిప్పేసుకుంది! ఆ సిగ్నల్ చాలు అతనికి!

లిఫ్ట్ కోసం వైట్ చేస్తున్న ఆమె తన వెనకే వచ్చిన అతనిని చూసి లోలోపల నవ్వుకుంది. లిఫ్ట్ లో ఇద్దరే ఉన్నప్పుడు, ఎవరూ లేని ఆ దగ్గరితనంలో ఆమె అందాన్ని చూసి అతను ఉక్కిరిబిక్కిరి అయ్యాడు! లిఫ్ట్ దిగి రూం కి వెళ్తున్న ఆమెను అతను నెమ్మదిగా అనుసరించాడు. రూం డోర్ తీస్తూ ఆమె అతనికేసి చూసి విసిరిన చూపును అతను ఆహ్వానంగా భావించాడు! కొద్ది సేపు ఆగి, రూం దగ్గరకి వెళ్ళి తలుపు నెమ్మదిగా తెరిచేందుకు ప్రయత్నించాడు! డోర్ లాక్ చేసి లేదు!

2

“మీరు పంపిన ఫొటోలో ఉన్నతను నిన్న ఓబెరాయ్ హోటల్ రూమ్ లో మీరు చెప్పినట్టే చెకిన్ అయ్యాడు! నేను వలేశాను!”

“గుడ్! పడ్డాడా?”

“అఫ్ కోర్స్! ఈ రేఖ అందానికి పడని వాళ్ళు ఉంటారా?”

“అందుకే కాస్ట్ ఎక్కువైనా కోటి రూపాయలిచ్చి నిన్ను పెట్టుకున్నాం! ఆ వీడియో పంపు!”

“ష్యూర్! నా ఫేస్ బ్లర్ చేసి మా సెక్స్ టేప్ పంపిస్తాను! ఇంతకీ ఎవరితను? మంచి హేండ్సమ్ గా ఉన్నాడు!”

“అది బిజినెస్! నీకు అనవసరం! థాంక్స్ ఫర్ యువర్ సర్విస్!”

3

అతనికి మెలకువ వచ్చిన వెంటనే రాత్రి ఆమెతో గడిపిన మధురమైన శృంగార క్షణాలు గుర్తొచ్చి పెదాలపై ఓ చిరునవ్వు విరిసింది. ఆమెను మళ్ళీ ఓసారి వెచ్చగా పొదువుకోవాలని చేయి చాచాడు. ఆమె తగలలేదు. కళ్ళు తెరిచిచూస్తే ఆమె పక్కన లేదు! అతని పెదాలపై మళ్ళీ ఓ చిరునవ్వు!

వెంటనే సెల్ ఫోన్ అందుకుని ఫోన్ చేశాడు –

“సార్! మీరు చెప్పినట్టే మీ పేరు మీద ఓబెరాయ్ లో చెకిన్ అయ్యాను! మీరు చెప్పినట్టే ఓ అందమైన అమ్మాయి నన్ను సెడ్యూస్ చేసింది! చాలా అందమైన అమ్మాయి! తర్వాత ఏమి చెయ్యాలో మీరు చెప్పలేదు!”

“వెల్ మైడియర్ యంగ్ బాయ్! తర్వాత ఏం చెయ్యాలో నీకు నిజంగా చెప్పాలా? డిడ్ యూ ఎంజాయ్?”

“యస్ సార్! థాంక్యూ! నా జీవితంలో నిన్నో మరిచిపోలేని రాత్రి. నాలాంటి పేరు లేని మోడల్ కి మీరు డబ్బులిచ్చి మరీ ఇంత అదృష్టం ఎందుకు కల్పించారో నాకు అర్థం కావట్లేదు.”

“వెల్! నా బిజినెస్ రీజన్స్ నాకున్నాయిలే! యూ డిడ్ ఏ గుడ్ జాబ్! నీ మిగతా పేమెంట్ ఇప్పుడే పంపిస్తాను. ఎనీథింగ్ ఎల్స్?”

“థాంక్యూ సర్! ఒక్క విషయం – ఒక్క అద్భుతమైన అనుభవాన్ని మీరు మిస్ చేసుకున్నారు!”

“హ హ! నీలాంటి బ్యాచిలర్స్ ఏం చేసినా చెల్లుతుంది! ఐ ఆమ్ ఏ హ్యాపీలీ మేరీడ్ మేన్!”

“దట్ ఈజ్ గ్రేట్ సార్! బై!”

4

రాత్రి సిటీలో ఇంకో ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ లో ఒకతను కుర్చీలో కూర్చుని విస్కీ సిప్ చేస్తున్నాడు. సింగిల్ పీస్ సిల్క్ నైటీలో ఒక అందమైన అమ్మాయి అతని ఎదురుగా బెడ్ పైన కూర్చుని ఉంది. ఆమె కూర్చున్న భంగిమలో శృంగారం తొణికిసలాడుతోంది.

అతను ఆమెతో మాట్లాడుతున్నాడు –

“రమేశ్ కుమార్! CEO ఆఫ్ కుమార్ ఇండస్ట్రీస్! మా ఫ్యామిలీలో మోస్ట్ ఇంటలిజెంట్ వ్యక్తిని. మా ఫ్యామిలీ బిజినెస్ ని ప్రాఫిట్స్ లో నడిపిస్తున్న వాణ్ణి! బట్, నా ఎదుగుదలా పేరూ మా ఫ్యామిలీలో కొందరికి గిట్టలేదు. నన్ను CEO పోస్ట్ నుంచి ఎలాగైనా తప్పించి వాళ్ళు CEO అవ్వాలని కొన్నేళ్ళ నుంచీ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు! నా బిజినెస్ ఎబిలిటీని తప్పుపట్టలేక నా క్యారెక్టర్ ని చెడ్డగా చూపించాలని కొత్త ఎత్తు వేశారు! యూ నో, నాకు చాలా బుద్ధిమంతుణ్ణి అని పేరుంది మా ఫ్యామిలీలో! కానీ ఎవరికీ తెలియని ఒక్క వీక్నెస్ నాకు ఉందని వాళ్ళకి తెలుసు! అందుకే, మిస్ రేఖా, నిన్ను బాణంగా నాపైకి వదిలారు!”

“నేను అందాన్ని అభిమానిస్తాను. ఆ అందం ఒక అమ్మాయిలో ఉంటే ఆరాధిస్తాను. ఒంపుసొంపులున్న ఆడదాన్ని లాలించి ముద్దులతో సేవ చెయ్యడం నా కనీస ధర్మంగా భావిస్తాను. దటీజ్ ద మినిమమ్ ఐ కెన్ డూ టు ఆనర్ ద ఫెమినైన్ బ్యూటీ! కానీ ఈ సమాజం అది తప్పంటుంది. పెళ్ళైన మగవాడు పెళ్ళానికే కట్టుబడాలంటుంది! అందుకే నేను ఎవరికీ తెలియకుండా నా రొమాన్స్ కొనసాగిస్తాను. ఐ యామ్ ఏ రొమాంటిక్ మేన్, రేఖా!”

రేఖ వయ్యారంగా లేచి అతని గ్లాసులో విస్కీ పోస్తూ –

“వెల్! ఐ విల్ సూన్ సీ హౌ రొమాంటిక్ యూ ఆర్ ! ఇంతకీ మీ ప్లేసులో ఇంకో కుర్రాణ్ణి పెట్టి ఈ కథంతా ఎందుకు నడిపారు? నాకు పంపిన ఫొటో కూడా ఎలాగో మార్చారు!”

“ఐ హావ్ మై సోర్సస్ అండ్ రిసోర్సస్! యస్, నేను ఈజీగా నీ వలనుంచి తప్పించుకోవచ్చు. కానీ నా ఎనిమీస్ చేత డబ్బు ఖర్చు చేయించి, వాళ్ళని గెలిచినట్టు ఊరించి ఓడించడంలో ఉన్న థ్రిల్ వేరు! నువ్వు వాళ్ళకి పంపిన వీడియోలో నా బదులు ఇంకెవరినో చూసి వాళ్ళ ముఖాలు మాడిపోవడం తలుచుకుంటే నాకు నవ్వాగట్లేదు. దిస్ ఈజ్ ఏ ఫన్ గేమ్! ఐ లైక్ గేమ్స్!”

“యెస్! మీ టూ! ఫన్ గేమ్స్ అన్నా ఫన్ గేమ్స్ ఇష్టపడే మగాళ్ళన్నా నాకిష్టం!” హస్కీగా అంది రేఖ!

రేఖ వయ్యారాన్ని కళ్ళతోనే తాగుతున్నాడు రమేశ్. విస్కీ కంటే ఎక్కువ మత్తెక్కిస్తోంది ఆమె అందం.

“నా ఎనిమీస్ చేసిన పని నాకు కోపం తెప్పించినా వాళ్ళ టేస్ట్ ని నేను మెచ్చుకుంటున్నాను రేఖా! నీ గురించి చాలా విన్నాను, చాలా అందగత్తెవనీ, పడకగది పరిమళానివనీ. అందుకే నా గెలుపును సెలబ్రేట్ చేసుకోవడానికి నిన్నే బుక్ చేసుకున్నాను!”

“మరి ఇంకెందుకు ఆలస్యం! సెలబ్రేట్ చేసుకుందామా?”, కన్ను కొట్టింది రేఖ అతనికి దగ్గరవుతూ!

5

“మిసెస్ కుమార్! నేను పంపిన వీడియో చూశారా?”

“చూశాను!”

“యువర్ హజ్బెండ్ రమేశ్ ఈజ్ గుడ్ ఇన్ బెడ్! డోంట్ యూ ఎగ్రీ?”

“ఐ నో! కానీ పెళ్ళాన్ని పట్టించుకోనివాడు ఎంత రసికుడైనా ఏం లాభం?”

“లాభం ఉంది మిసెస్ కుమార్! ఈ వీడియో వల్ల మీరెన్నాళ్ళ నుంచో అనుమానిస్తున్న మీ హజ్బెండ్ శృంగారలీలలు మీకు తెలిశాయి. ఆనందం లేని కాపురం నుంచి మీకు విముక్తి లభిస్తుంది. డివోర్స్ సెటిల్మెంట్ లో మనీ చాలా వస్తుంది. అందులోంచి కమిషన్ గా రెండు కోట్లు నాకొస్తాయి. చూశారా ఎన్ని లాభాలో!”

“ఈ హెల్ప్ నువ్వు నాకెందుకు చేస్తున్నావ్?”

“ఇది హెల్ప్ అనుకోను నేను మిసెస్ కుమార్! ఐ గెట్ మై మనీ! మోర్ దేన్ దట్, ఐ గెట్ ద థ్రిల్! మగాడు తనకు తాను చాలా బలవంతుణ్ణనీ, తెలివైనవాణ్ణనీ అనుకుంటాడు. కానీ ఆడదాని ఓరచూపుకి, ఒంపుసొంపులకీ ఇట్టే లొంగిపోయే వీక్ నేచర్ తనదని తెలుసుకోడు. లేడిని వేటాడ్డం సింహానికి థ్రిల్ కాదు, అది ఆకలీ అలవాటూ మాత్రమే. కానీ సింహాన్ని లేడి వేటాడితే, దటీజ్ ద రియల్ థ్రిల్! ఒక పవర్ఫుల్ మగాడు నా వల్లో చిక్కినప్పుడల్లా నాకదే థ్రిల్ కలుగుతుంది. ఇట్ ఈజ్ మై గేమ్! పనిలో పనిగా మీలాంటి వాళ్ళకి చిన్న హెల్ప్ కూడా జరగడం మంచిదే కదా!”

“థాంక్యూ!”

“మై ప్లెజర్ డూయింగ్ బిజినెస్ విత్ యూ, మిసెస్ కుమార్! వచ్చే సారి మంచి హజ్బెండ్ ని ఎంచుకోండి! నాలాంటి అందానికి కూడా పడనివాణ్ణి! గుడ్ లక్!”

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s