సుందరి – సీతారామ్!

1 సుందరి పేరుకి తగ్గట్టే అందంగా ఉంటుంది. “ఆ, అందాన్ని కొరుక్కు తింటామా ఏం!” అని రసికత లేని కొందరు తీసిపడేస్తూ ఉంటారు. అది నిజమే కావొచ్చు. కానీ కొరుక్కు తినాలనిపించేంత అందంగా ఉంటే తప్పులేదు! అంతటి అందం సుందరికి ఉంది. కానీ తప్పంతా ఆ పేరులోనే ఉంది. “అసలు ఏమాత్రం ఆలోచన ఉన్నా, కూతురుకి ఇలాంటి పేర్లు ఎవరైనా పెడతారా? కాలేజీలో అబ్బాయిలు ఎన్ని కామెంట్లు వేస్తారని?” అని అమ్మతో చాలా సార్లు గొడవ పెట్టుకుంది… Continue reading సుందరి – సీతారామ్!

మధులత

1 ఎందుకీ ప్రాయము నీది కానప్పుడు… వద్దులే ప్రాణము నీవు రానప్పుడు… ఈ రాయబారాలు సాగే చలిలో! ఈ హాయిభారాలు మోసే జతలో!! చల్లని రాత్రివేళ ఫోన్ లోని FM రేడియో లోంచి వినిపిస్తున్న పాట గదంతా పరుచుకుంటోంది. ఆ గదిలోని మంచం మీద బోర్లా పడుకుని “స్వాతి” లో సరసమైన కథ చదువుతున్న ఆ అమ్మాయి “హాయిభారాలు” అన్న కవిప్రయోగానికి చిన్నగా నవ్వుకుంది. పాట ప్రభావమో, లేక చదువుతున్న కథ మహిమో ఏమో, ఒక కమ్మని… Continue reading మధులత

ద గేమ్!

1 “ఎక్స్క్యూజ్ మీ! కన్ ఐ జాయిన్ యూ?” తియ్యని గొంతు విని తలెత్తి చూశాడతను! తలతిప్పుకోలేని అందం! ఆమే! “ష్యూర్! ఇట్ ఈజ్ మై ప్లెజర్!” “థాంక్యూ!” తన డిన్నర్ టేబుల్ దగ్గర ఆమె కూర్చోవడంతో కాండిల్ లైట్ డిన్నర్ ఫీల్ వచ్చింది అతనికి! ఆమే కాండిల్ మరి! ఆమె సోయగపు మిలమిలల ముందు ఆ ఫైవ్ స్టార్ హోటల్ కాంతుల ధగధగలు చిన్నబోయి మసకబారాయి. శృంగారం అంతా రంగరించినట్టుంది ఆమె చీరకట్టు. కనిపించీ కనిపించనట్టు… Continue reading ద గేమ్!

హ్యాపీ బర్త్ డే !

1 నాకు పుట్టినరోజులు జరుపుకోవడం ఇష్టం ఉండదు ! శ్రీరామనవమి, కృష్ణాష్టమి జరుపుకున్నట్టు మన జయంతి ఉత్సవాలు మనమే జరుపుకోవడానికి ఏమి సాధించామని? “నేను పుట్టానహో !” అని గొంతెత్తి అరవడానికి చేసిన ఘనకార్యమేమిటని? లోకానికి వెలుగునిచ్చే మహా మహా సూర్యుడే రోజూ సైలంటుగా వచ్చి వెళ్ళిపోతుంటాడు ! మనమెంత? “నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తావోయ్ ! ఆనందంగా ఓ రోజు సెలబ్రేట్ చేసుకోడానికి మనం పెట్టుకున్నవే ఈ పుట్టినరోజులూ పండగలూ వగైరా . పెద్ద కారణం… Continue reading హ్యాపీ బర్త్ డే !

చీకటి మరకల ఉదయం!

1 కుక్కర్ మూడో కూత వేసింది! అప్పటికే టిఫిన్ చెయ్యడం పూర్తి చేసి, ఆఫీసుకి వెళ్ళే శ్రీవారికీ, స్కూలుకి వెళ్ళే కూతురుకీ ఆ రోజు వేసుకోవాల్సిన బట్టలు తీసిపెడుతున్న సుభద్ర వెంటనే బెడ్రూంలోంచి వంటింట్లోకి వచ్చి స్టవ్ ఆఫ్ చేసింది. ఏ పనిలో ఉన్నా చెవిని కుక్కర్ కూతలపై వేసి లెక్కతప్పకుండా మూడో కూత తరువాత ఠక్కున కట్టేసే ప్రజ్ఞ ఆమె సొంతం! కూతురూ, భర్తా హడావిడిగా రెడీ అయ్యే లోపు ఆమె వేడి వేడి టిఫిన్… Continue reading చీకటి మరకల ఉదయం!

నిత్యవిచారిణి!

1 “సంతూ! నువ్వు అదృష్టవంతురాలివే! పెళ్ళాన్ని క్రిటిసైజ్ చెయ్యడంలో ముందుండే మొగుళ్ళే తప్ప ప్రైజూ, సర్‌ప్రైజూ చేసే మొగుళ్ళు ఎక్కడో కానీ ఉండరే! సర్‌ప్రైజ్‌గా పట్టమహిషికి పట్టుచీర కొనిచ్చే మొగుడు దొరికినందుకు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోవాలి కానీ ఇంకా ఈ వంకలు పెట్టడం దేనికే?” “చాల్లేవే వల్లీ! నువ్వు మరీ చెప్తావ్! ఇంత పెద్ద బోర్డర్ ఉన్న చీరలు నాకు నచ్చవని నీకు తెలీదూ? పెళ్ళాన్ని ప్రేమించే మొగుడు పెళ్ళాం ప్రేమించేవి తెలుసుకోలేడూ? మల్లెపూలు తెచ్చిచ్చేస్తే మంచి… Continue reading నిత్యవిచారిణి!

ద సెవెన్ ఇయర్ ఇచ్!

1 లలితకి నిద్ర పట్టట్లేదు. పక్కనే ఇద్దరు పిల్లలూ మత్తుగా నిద్రపోతున్నారు, ఆ పక్కనే శ్రీరాం అనబడే శ్రీవారు కూడా. తన నిద్రలేమికి కారణం అతనే! ఇందాకే దాహం అనిపించి లేచినప్పుడు, శ్రీరాం ఏదో కలవరిస్తున్నట్టు అనిపించి దగ్గరకి వెళ్ళి వింది. “స్వప్నా! స్వప్నా!” అని పలవరిస్తున్నాడు. దెబ్బకి మత్తంతా వదిలిపోయి, స్వప్నజగత్తు నుంచి బైటకొచ్చింది. “ఎవరీ స్వప్న?”. శ్రీరాం ఆఫీసులో అమ్మాయిలూ, బైట అతని ఆడ స్నేహితులూ అందరూ దాదాపుగా తనకి తెలుసు. కాస్త అందంగా… Continue reading ద సెవెన్ ఇయర్ ఇచ్!