అనగనగా ఓ పింకు పర్సు కథ!

  1 “Blue is for boys and pink is for girls!” “Blue is for boys and pink is for girls!” ఐదేళ్ళ నా కూతురు నన్ను ఆటపట్టిస్తూ ట్యూన్ కట్టి మరీ రిపీట్ మోడ్‌లో పాడుతోంది! స్నానానికి వెళుతూ ఏమరపాటులో నా టవల్ బదులు నా కూతురి పింక్ టవల్ అందుకోబోవడమే నేను చేసిన తప్పు! అందుకు ఈ పరాభవం తప్పలేదు. “చూడు బుజ్జమ్మా! గర్ల్ కలర్స్ అనీ బోయ్… Continue reading అనగనగా ఓ పింకు పర్సు కథ!

అదృష్టం వాటేసుకుంటే…

నేను అదృష్టాన్ని నమ్మను! కానీ కొన్ని సార్లు అదృష్టమే మనని నమ్ముకుంటుంది. అలాంటప్పుడు ఏమీ చెయ్యలేం! అదృష్టం వాటేసుకుని ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటే కాదనడం పురుషలక్షణం కాదు కూడా! ఇలా అదృష్టం నా ప్రేయసిగా ఉన్న B.Tech ఫైనల్ ఇయర్ రోజుల్లోని కొన్ని తీపిముచ్చట్లు… కోయిల కూసిన వేళ జనవరిలో సంక్రాంతి సెలవలకి ముందు విజయవాడలో పెద్ద పుస్తకప్రదర్శన ఒకటి జరుగుతుంది. విజయవాడ సిద్ధార్థాలో B.Tech చదివిన రోజుల్లో ప్రతి ఏడూ అక్కడకి వెళ్ళడం నాకు చాలా… Continue reading అదృష్టం వాటేసుకుంటే…

ఇది పాట కానే కాదు!

నేను: ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు జనం: మరి పాట ఆపెయ్ రాదూ? నీ గానం మాకు చేదు! షడ్జమం చిన్నప్పటి నుంచీ నాకు పాటలు పాడ్డం అంటే మహా ఇష్టం. మా family gatherings లో పిల్లలందరిచేతా పాటలు పాడించడం రివాజుగా ఉండేది. నేనూ ఓ పాట పాడ్డం, అందరూ మెచ్చుకోవడం జరిగేది. చిన్నపిల్లలు పాడినప్పుడు ప్రోత్సహించడానికి “బాగా పాడావ్” అంటారని, దానర్థం మనకి singing talent ఉన్నట్టు కాదని… Continue reading ఇది పాట కానే కాదు!

అమ్మాయిలూ చదువులరాణులూ!

నేను విజయవాడ సిద్ధార్థా కళాశాలలో ఇంజనీరింగ్  చదువుకునే రోజుల్లో నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదనే ప్రచారం ఒకటి ఉండేది. హాస్టల్లో రోజూ సాయంత్రం అబ్బాయిలందరూ చేరినప్పుడు సాగే పిచ్చాపాటీ కబుర్లలో సహజంగానే అమ్మాయిల గురించి చర్చలూ, కామెంట్లూ, గట్రా గిట్రా జరుగుతూ ఉండేవి. నేను అమ్మాయిల ప్రస్తావన రాగానే వెంటనే లేచి వెళ్ళిపోయేవాడిని. ఇది చూసీ చూసీ ఎవరో “ఫణీంద్రకి అమ్మాయిలంటే పడదేమో” అన్న అనుమానం వ్యక్తం చెయ్యడం, ఆ అభిప్రాయం స్థిరపడడం జరిగిపోయాయి. “అమ్మాయిలంటే పడని… Continue reading అమ్మాయిలూ చదువులరాణులూ!

చిల్లర

Note:కథలు రాయాలనే ప్రయత్నం చేసి చాలా కాలం క్రితం రాసుకున్న సరదా కథ ఇది. చెన్నై తిరువాన్మయూర్ జంక్షనులో సిటీ బస్ కోసం వైట్ చేస్తున్నాను. “అబ్బా! ఉక్కపోత”. మధ్యాహ్నం సూర్యుడు ధారాళంగా ఎండ కురిపించి వెళ్ళాడేమో, ఇంకా వేడి తగ్గలేదు. చుట్టూ జనం జనం. చెన్నైలో రెండు సముద్రాలు ఉన్నాయి – ఒకటి జల సముద్రం, రెండోది “జన” సముద్రం. ఇదిగో ఆ జన సముద్రంలో ఈదుతూ, ఆఫీస్ నుండీ తిరిగొస్తున్న నన్ను ఇంటి ఒడ్డుకి… Continue reading చిల్లర