నిత్యవిచారిణి!

1 “సంతూ! నువ్వు అదృష్టవంతురాలివే! పెళ్ళాన్ని క్రిటిసైజ్ చెయ్యడంలో ముందుండే మొగుళ్ళే తప్ప ప్రైజూ, సర్‌ప్రైజూ చేసే మొగుళ్ళు ఎక్కడో కానీ ఉండరే! సర్‌ప్రైజ్‌గా పట్టమహిషికి పట్టుచీర కొనిచ్చే మొగుడు దొరికినందుకు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోవాలి కానీ ఇంకా ఈ వంకలు పెట్టడం దేనికే?” “చాల్లేవే వల్లీ! నువ్వు మరీ చెప్తావ్! ఇంత పెద్ద బోర్డర్ ఉన్న చీరలు నాకు నచ్చవని నీకు తెలీదూ? పెళ్ళాన్ని ప్రేమించే మొగుడు పెళ్ళాం ప్రేమించేవి తెలుసుకోలేడూ? మల్లెపూలు తెచ్చిచ్చేస్తే మంచి… Continue reading నిత్యవిచారిణి!

అదృష్టం వాటేసుకుంటే…

నేను అదృష్టాన్ని నమ్మను! కానీ కొన్ని సార్లు అదృష్టమే మనని నమ్ముకుంటుంది. అలాంటప్పుడు ఏమీ చెయ్యలేం! అదృష్టం వాటేసుకుని ముద్దులు పెట్టేసుకుంటూ ఉంటే కాదనడం పురుషలక్షణం కాదు కూడా! ఇలా అదృష్టం నా ప్రేయసిగా ఉన్న B.Tech ఫైనల్ ఇయర్ రోజుల్లోని కొన్ని తీపిముచ్చట్లు… కోయిల కూసిన వేళ జనవరిలో సంక్రాంతి సెలవలకి ముందు విజయవాడలో పెద్ద పుస్తకప్రదర్శన ఒకటి జరుగుతుంది. విజయవాడ సిద్ధార్థాలో B.Tech చదివిన రోజుల్లో ప్రతి ఏడూ అక్కడకి వెళ్ళడం నాకు చాలా… Continue reading అదృష్టం వాటేసుకుంటే…

ద సెవెన్ ఇయర్ ఇచ్!

1 లలితకి నిద్ర పట్టట్లేదు. పక్కనే ఇద్దరు పిల్లలూ మత్తుగా నిద్రపోతున్నారు, ఆ పక్కనే శ్రీరాం అనబడే శ్రీవారు కూడా. తన నిద్రలేమికి కారణం అతనే! ఇందాకే దాహం అనిపించి లేచినప్పుడు, శ్రీరాం ఏదో కలవరిస్తున్నట్టు అనిపించి దగ్గరకి వెళ్ళి వింది. “స్వప్నా! స్వప్నా!” అని పలవరిస్తున్నాడు. దెబ్బకి మత్తంతా వదిలిపోయి, స్వప్నజగత్తు నుంచి బైటకొచ్చింది. “ఎవరీ స్వప్న?”. శ్రీరాం ఆఫీసులో అమ్మాయిలూ, బైట అతని ఆడ స్నేహితులూ అందరూ దాదాపుగా తనకి తెలుసు. కాస్త అందంగా… Continue reading ద సెవెన్ ఇయర్ ఇచ్!

ఇది పాట కానే కాదు!

నేను: ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు జనం: మరి పాట ఆపెయ్ రాదూ? నీ గానం మాకు చేదు! షడ్జమం చిన్నప్పటి నుంచీ నాకు పాటలు పాడ్డం అంటే మహా ఇష్టం. మా family gatherings లో పిల్లలందరిచేతా పాటలు పాడించడం రివాజుగా ఉండేది. నేనూ ఓ పాట పాడ్డం, అందరూ మెచ్చుకోవడం జరిగేది. చిన్నపిల్లలు పాడినప్పుడు ప్రోత్సహించడానికి “బాగా పాడావ్” అంటారని, దానర్థం మనకి singing talent ఉన్నట్టు కాదని… Continue reading ఇది పాట కానే కాదు!

అనగనగా ఓ అమ్మాయి

1 అంత అందమైన అమ్మాయిని నేను మర్చిపోయానంటే ఆశ్చర్యంగా ఉంది. గుండె ఝల్లనిపించేంతటి సోయగం నా జ్ఞాపకాల్లోంచి గల్లంతైపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆంధ్రా అమ్మాయా, తెలంగాణా అమ్మాయా అని తర్కించకుండా, మన తెలుగింటి ముద్దుగుమ్మే అని సగర్వంగా, సమైక్యంగా ప్రతి నవయువకుడూ ఎలుగెత్తి చాటే అందం! తర్వాత తను నాదంటే నాదంటూ తన్నుకునేలా చేసి కుర్రగుండెల మధ్య చిచ్చుపెట్టేంత అందం! అమవాస్య లాంటి నా బుర్రలో వెలిగిన ఒక దీపావళి ధమాకాని మర్చిపోవడం అసంభవం! Hitec… Continue reading అనగనగా ఓ అమ్మాయి

అమ్మాయిలూ చదువులరాణులూ!

నేను విజయవాడ సిద్ధార్థా కళాశాలలో ఇంజనీరింగ్  చదువుకునే రోజుల్లో నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదనే ప్రచారం ఒకటి ఉండేది. హాస్టల్లో రోజూ సాయంత్రం అబ్బాయిలందరూ చేరినప్పుడు సాగే పిచ్చాపాటీ కబుర్లలో సహజంగానే అమ్మాయిల గురించి చర్చలూ, కామెంట్లూ, గట్రా గిట్రా జరుగుతూ ఉండేవి. నేను అమ్మాయిల ప్రస్తావన రాగానే వెంటనే లేచి వెళ్ళిపోయేవాడిని. ఇది చూసీ చూసీ ఎవరో “ఫణీంద్రకి అమ్మాయిలంటే పడదేమో” అన్న అనుమానం వ్యక్తం చెయ్యడం, ఆ అభిప్రాయం స్థిరపడడం జరిగిపోయాయి. “అమ్మాయిలంటే పడని… Continue reading అమ్మాయిలూ చదువులరాణులూ!

తాళి కట్టు శుభవేళ (skit)

ఓ బంధువుల పెళ్ళికి వెళ్ళాను ఆ మధ్య. అక్కడ సరదాగా ఒక skit చేద్దామంటే నేను అప్పటికప్పుడు కూర్చుని ఒక కథనం సమకూర్చడం జరిగింది. ఇది అందరితో పంచుకునే ప్రయత్నమిది. Roles 1. కిరణ్: హీరో 2. లావణ్య: హీరోయిన్ 3. తేజ, రాజా, ఆనంద్, హేమంత్: హీరో ఫ్రెండ్స్ 4. లోహిత, హరిత: హీరోయిన్ ఫ్రెండ్స్ 5. హీరో అమ్మా నాన్నా Starting scene Voice Over ప్రతి కథా కంచికి చేరినా చేరకున్నా ఎక్కడో… Continue reading తాళి కట్టు శుభవేళ (skit)